Supritha : ఓహో.. అందుకు అతనికి ఓకే చెప్పిందట.. క్లారిటీ ఇచ్చిన సురేఖవాణి కూతురు...!
Supritha : "అతనికి ఓకే చెప్పాను" అంటూ మొన్న సోషల్ మీడియాలో ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోను పెట్టి అందర్నీ షాక్‌కి గురిచేసింది;
Supritha : "అతనికి ఓకే చెప్పాను" అంటూ మొన్న సోషల్ మీడియాలో ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోను పెట్టి అందర్నీ షాక్‌కి గురిచేసింది సినీ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత.. దీనితో అతను ఎవరంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మరికొందరు అయితే ఏకంగా వీరికి కంగ్రాట్స్ కూడా చెప్పేశారు.
అయితే దీనిపైన సుప్రీత క్లారిటీ ఇచ్చింది. అతని పేరు రాకీ జోర్డాన్.. అతనితో కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో నటించేందుకు ఒకే చెప్పిందట సుప్రీత.. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. వెళ్ళిపో అంటూ సాగే ఈ పాటకి రాకీ జోర్డాన్ లిరిక్స్ అందించగా, సింగర్ రేవంత్ ఈ పాటను పాడాడు.
కాగా సినీ నటి సురేఖ వాణి కూతురుగా సుప్రీత అందరికీ సుపరిచితురాలే.. ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక తల్లిలాగే సుప్రీత కూడా సినిమాల్లోకి వస్తోంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది.