supritha : 'అతనికి ఓకే చెప్పాను'.. బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన సురేఖ వాణి కూతురు..!
Supritha : క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తల్లి, వదిన, అక్క వంటి పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంటుంది.;
Supritha : క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తల్లి, వదిన, అక్క వంటి పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంటుంది. ఇక ఆమె కూతురు సుప్రిత కూడా అందరికీ సుపరిచితురాలే.. సుప్రిత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకి సోషల్ మీడియాలో వీపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
తనతల్లితో కలిసి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తోంది సుప్రిత . తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చింది సుప్రిత.. ఓ వ్యక్తితో సన్నిహితంగా దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అతని ప్రేమకు ఓకే చెప్పాను అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
కాగా సుప్రీత బాయ్‌ఫ్రెండ్ పేరు రాకీ జోర్డాన్.. అతను ఓ నటుడు ఇంకా ర్యాపర్. ఇక తల్లిలాగే సుప్రీత కూడా సినిమాల్లోకి వస్తోంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది.