నటుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లిపీటలెక్కారు. 'మంజుమ్మల్ బాయ్స్' నటుడు దీపక్ పరంబోల్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2019లో విడుదలైన 'మనోహరం' సినిమా అపర్ణకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సమయంలో దీపక్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తాజాగా పెద్దల అంగీకారంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. కానీ అపర్ణ దాస్ మాత్రం కేవలం 28 ఏళ్ల వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టేసింది. 2018లో ‘న్యాన్ ప్రకాషన్’ సినిమాతో అపర్ణ దాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దాదా’ మూవీలో హీరోయిన్‌గా ఆకట్టుకున్న ఆమెకు.. విజయ్ ‘బీస్ట్’ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. మనోహరం, బీస్ట్, దాదా, ఆదికేశవ, సీక్రెట్ హోమ్ లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు అపర్ణ దగ్గరయ్యారు. ప్రస్తుతం అపర్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఒమన్‌లో పుట్టి పెరిగిన అపర్ణకు చిన్నప్పటినుంచి సినిమాల మీద మక్కువ. దీపక్ పరంబోల్పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.