Aishwarya Pisse: 'ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి?'.. సీరియల్ నటి ఎమోషనల్

Aishwarya Pisse: తాజాగా ఓ సీరియల్ నటి కూడా తన జీవితంలోని చేదు అనుభవాల గురించి అందరికీ చెప్తూ ఎమోషనల్ అయిపోయింది.;

Update: 2022-03-24 12:13 GMT

Aishwarya Pisse (tv5news.in)

Aishwarya Pisse: మామూలుగా గ్లామర్ ప్రపంచం అంటే మనకు కనిపించనదానికంటే కనిపించనిదే ఎక్కువగా ఉంటుంది. మనల్ని స్క్రీన్ ముందుకు వచ్చి అలరించే నటీనటుల వెనుక ఎంతో విషాదం కూడా ఉండే అవకాశం ఉంది. కానీ అందులో కొందరు మాత్రమే వారి పర్సనల్ విషయాలను బయటపెడతారు. చాలామంది బయటపెట్టలేకపోతారు. తాజాగా ఓ సీరియల్ నటి కూడా తన జీవితంలోని చేదు అనుభవాల గురించి అందరికీ చెప్తూ ఎమోషనల్ అయిపోయింది.

సినిమాల్లోనే కాదు.. సీరియళ్లలో కూడా పరభాష నటీమణులు డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతం సీరియల్ ఆర్టిస్టులకు తెలుగులో వెలిగిపోతున్న ఎక్కువమంది హీరోయిన్లు కన్నడ నుండి వచ్చినవారే. అందులో ఒకరు ఐశ్వర్య పిస్సే. ఇప్పటివరకు దాదాపు అన్ని తెలుగు ఫేమస్ ఛానెళ్లలో సీరియల్స్ చేసిన ఐశ్వర్య.. తాజాగా తన చిన్నతంలోని ఓ చేదు జ్ఞాపకం గురించి బయటపెట్టింది.

తాను కడుపులో ఉన్నప్పుడే తన తండ్రి.. తన తల్లిని వదిలేసి వెళ్లిపోయాడని బయటపెట్టింది ఐశ్వర్య. అప్పటినుండి తన తల్లి ఎన్నో కష్టాలు పడి తనను ఈ స్టేజ్‌లో నిలబెట్టిందని తెలిపింది. అంతే కాకుండా ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలంటూ ప్రశ్నించింది. పెళ్లి చేసుకొని ఒక ఆడదాని జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అని అడిగింది. 'దయచేసి మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి.. ఒక ఆడదాన్ని జీవితాన్ని నాశనం చేయకండి ప్లీజ్' అంటూ ఎమోషనల్ అయ్యింది ఐశ్వర్య.

Tags:    

Similar News