Akhanda 2 : అఖండ 2 పోస్ట్ పోన్ కొత్త డేట్ ఇదేనా..?

Update: 2025-07-16 05:15 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న మూవీ ‘అఖండ 2 : తాండవం’.ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్, సంయుక్త ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. భజరంగి భాయీజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా ఇది. గత మూడూ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ కావడంతో అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ అవుతోందని లేటెస్ట్ న్యూస్. అదే డేట్ కు పవన్ కళ్యాణ్ ‘ఓ.జి’ విడుదలవుతోంది. అయితే అఖండ 2 వాయిదాకు ఓ.జి కారణం కాదు.

అఖండ 2 ను ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. నిజానికి ఫస్ట్ పార్ట్ అలా రిలీజ్ చేసి ఉంటే మరింత పెద్ద విజయం సాధించి ఉండేది. ఈ మూవీకి ఆ స్పాన్ ఉంది కాబట్టి. ఇక ఈ పార్ట్ కు సంబంధించి అనుకున్న షెడ్యూల్స్ ఇన్ టైమ్ లో కాలేదు. రీసెంట్ గా ప్రయాగలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. అనుకోని కారణాలతో ఆ షెడ్యూల్ వాయిదా పడింది. మరోవైపు విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా డిలే అయ్యేలా ఉన్నాయట. దసరా హాలిడేస్ అని హడావిడీగా విడుదల చేయడం కంటే బెస్ట్ కంటెంట్ ను కాస్త లేట్ గా ఇచ్చినా ఫర్వాలేదు అనుకున్నారట. అందుకే అఖండ 2 ను డిసెంబర్ 18న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని టాక్. డిసెంబర్ లో ఇప్పటి వరకూ పెద్ద సినిమాలు అంటే 5న ప్రభాస్ రాజా సాబ్ ఉంది. తర్వాత తెలుగు నుంచి పెద్ద సినిమా అంటే అఖండ 2నే అవుతుంది. సో.. అఖండ 2 సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 18కి పోస్ట్ పోన్ అయినట్టే అనుకోవచ్చు.

Tags:    

Similar News