Alia Bhatt: "ఈ జాతీయ అవార్డు మీది.. ఎందుకంటే": అలియా ఎమోషనల్ నోట్
జాతీయ అవార్డుపై ఆనందం.. భావోద్యేగ పోస్ట్ చేసిన అలియా;
న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఆగస్టు 24న 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. బాలీవుడ్ హీరోయిన్స్ ఆలియా భట్, కృతి సనన్ వరుసగా 'గంగూబాయి కతియావాడి', 'మిమీ' చిత్రాలకు ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ విజయం తర్వాత, అలాయా భట్.. సంజయ్ లీలా భన్సాలీకి ఓ హృదయపూర్వక నోట్ ను రాసింది. దాంతో పాటు ఆమె తోటి విజేత సనన్‌ను కూడా అభినందించింది. ఈ ఎమోషనల్ నోట్ ఇప్పుడు నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది.
ఈ సందర్భంగా అలియా భట్.. తన ఇన్ స్టా ఖాతాలో రెండు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె రెండు అద్భుతమైన చిత్రాలను పంచుకున్నారు. మొదటి ఫ్రేమ్‌లో, ఆమె గంగూబాయి భంగిమలో కనిపించింది. ఆ తర్వాతి ఫొటోలో భట్ నవ్వకుండా ఉండలేకపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చిత్రాలను పంచుకుంటూ, 'సంజయ్ సార్'కి ఒక నోట్ రాసింది. ఆమె మొత్తం సిబ్బందికి, తన కుటుంబానికి, బృందానికి, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. "ఈ జాతీయ అవార్డు మీది.. ఎందుకంటే మీరు లేకుండా ఇవేవీ సాధ్యం కాదు.. సీరియస్‌గా" అని రాసింది.
దాంతో పాటు అలియా భట్.. కృతి సనన్‌ను ట్యాగ్ చేసి, 'మిమీ'ని చూసిన రోజు నాటి సన్నివేశాన్ని గుర్తు చేసుకుంది. సనన్‌ను మిమీగా చూసిన తర్వాత ఆమె ఏడుపు ఆపుకోలేకపోయిందని భట్ వెల్లడించింది. దీన్ని అలియా 'నిజాయితీ, శక్తివంతమైన' ప్రదర్శన అని పేర్కొంది.
ఆలియా భట్ పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే, కృతి సనన్ కూడా ఓ కామెంట్ ను వదిలింది. "త్వరలోనే సెలబ్రేట్ చేసుకుందాం" అని రాసింది. మొదటి సారిగా జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు దీపికా పదుకొణె కూడా భట్‌ను అభినందించింది.
సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన, వ్యభిచార గృహాంలో ఉండే గంగూబాయి కతియావాడి అనే ఒక యువతి జీవితాన్ని గురించి చూపించింది. ఆ తర్వాత ఆమె అండర్వరల్డ్ కనెక్షన్ల సహాయంతో ప్రపంచాన్ని నియంత్రించింది. గంగూబాయి పాత్రలో భట్ నటన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతే కాదు 2022లో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ హిందీ చిత్రంగా కూడా నిలిచింది.
ఇక కృతి సనన్ 'మిమీ' విషయానికొస్తే ఇది భారతదేశంలో సరోగసీ గురించి తెలిపింది. విదేశీ జంటకు అద్దె తల్లిగా ఉండటానికి అంగీకరించిన మిమీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే, ఆ దంపతులు బిడ్డను ఉంచుకోవడానికి నిరాకరించడంతో ఆమె జీవితం తలకిందులౌవుతుంది.