Alia Bhatt: పింక్ లెహెంగాలో బటర్‌ఫ్లైలాగా ఆలియా భట్.. ధర ఏకంగా లక్షల్లో..
Alia Bhatt: ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆలియా భట్ హవా నడుస్తోంది.;
Alia Bhatt (tv5news.in)
Alia Bhatt: మామూలుగా సెలబ్రిటీలు ఏ విషయంలో అయినా బ్రాండ్‌ను బాగా ఫాలో అవుతారు. దుస్తుల దగ్గర నుండి ఎలక్ట్రానికి ప్రొడక్ట్స్ వరకు చాలావరకు సెలబ్రిటీలు ఖరీదైన బ్రాండ్స్‌నే ఇష్టపడతారు. ఒక్కొక్కసారి సింపుల్‌గా ఉన్నా.. సెలబ్రిటీల దుస్తుల ధరలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా ఓ పింక్ లెహెంగాలో బటర్ ఫ్లై లాగా మెరిసిపోతున్న ఆలియా డ్రెస్ ధర తెలిస్తే అలాగే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆలియా భట్ హవా నడుస్తోంది. గత కొన్నేళ్లుగా సీనియర్ హీరోయిన్లు సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించేశారు. ప్రస్తుతం బీ టౌన్‌లో హవా అంతా యంగ్ హీరోయిన్లదే. యంగ్ హీరోయిన్లు కూడా ఒకే ప్రాజెక్ట్‌పై సంవత్సరంపైన టైమ్ వేస్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆలియా.. 'గంగూబాయి కతియావాడి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలయిన 'గంగూబాయి కతియావాడి' ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో ఆలియా భట్‌తో పాటు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ మూవీతో ఆలియా మార్కెట్ కూడా పెరిగిపోయింది. ఇక తాజాగా ఆలియా భట్ ఓ లెహెంగాలో దిగిన ఫోటోలు తన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ లెహెంగా ధర ఏకంగా రూ. 2 లక్షలు అని సమాచారం. ఆలియా ఫోటో వావ్ అనుకున్న వారంతా ధర చూసి ఆశ్చర్యపోతున్నారు.