ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక.. గీత గోవిందం సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా ఆమె తన సత్తా చాటుతూ వస్తుంది. పాన్ ఇండియా సినిమాల కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో వెయ్యి కోట్ల హీరోయిన్గా మారిన ఈ చిన్నది ఇప్పుడు కుబేర సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. రష్మిక ఇంతగా సక్సెస్ను అందుకోవడాకి స్క్రిప్ట్ ఎంపికే ప్రధాన కారణం. వరుస పాన్ ఇండియా సినిమా కథలను ఎంచుకోవడమే కాకుండా వాటిల్లో తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది. అదే ఆమెను టాప్ లో నిలబెట్టింది. బాలీవుడ్, టాలీవుడ్లో కూడా మంచి కథలను ఎంచుకొని వరుస విజయాలను అందుకుంటుంది. దీంతో కొన్నేళ్లుగా రష్మిక పట్టిందల్లా బంగారమే అని చెప్పొచ్చు.