Allu Aravind : అందుకే సాయి పల్లవిని ‘తండేల్’కు తీసుకున్నాం: అల్లు అరవింద్
తండేల్ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి వంద శాతం న్యాయం చేశారని నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సాయి పల్లవిని హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసింది నేనే. ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు ఈ పాత్రకు న్యాయం చేయలేరని నాకు అనిపించింది. ఎన్నో భావోద్వేగాల్ని పండించాల్సిన పాత్ర కావడంతో సాయి పల్లవే సరైన ఛాయిస్ అని ఆమెను తీసుకున్నాం. ఈ పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం గుర్తుండిపోతుంది’ అని కొనియాడారు.
‘‘ఈ చిత్రంలో సాయి పల్లవి ఎంపిక నా నిర్ణయమే. ఇది కమర్షియల్ నిర్ణయమని చెప్పాలి. ఈ పాత్ర కోసం నేను ముంబయి వెళ్లి ఎవరినీ తీసుకురాలేదు. ముంబయి నుంచి వచ్చిన వైట్ స్కిన్ అమ్మాయిలు ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనిపించింది. ఇది ఎన్నో భావోద్వేగాలతో కూడిన పాత్ర. ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఇలాంటి గొప్ప పాత్రను నిజాయతీగా చేయాలి. సాయిపల్లవి అయితే వంద శాతం న్యాయం చేయగలదని నాకు అనిపించింది. ఆమె అసాధారణమైన నటి. అందుకే ఆమెను ఎంపిక చేశాం. మేము అనుకున్నట్లుగానే సాయిపల్లవి వందశాతం న్యాయం చేసింది’’ అని చెప్పారు.
ఇక ‘తండేల్’ విషయానికొస్తే.. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లగా, పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘తండేల్’ నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది.