Allu Arjun : శివ పుత్రుడుగా అల్లు అర్జున్

Update: 2025-01-27 09:45 GMT

పుష్ప 2 తో ‘ఫాస్టెస్ట్’ గా అనేక రికార్డులు బద్ధలు కొట్టాడు ఐకన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీతో మనోడు ప్యాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ గా అవతరించాడు. ఇదే సినిమాతో జీవితంలో అతిపెద్ద చేదు అనుభవాన్ని కూడా చూసి ఉన్నాడు. అయినా సినిమా ఇచ్చే కిక్ వేరే కదా. ప్రస్తుతం ఆ కేస్ నుంచి దాదాపు ఉపశమనం పొంది ఉన్నాడు. ఇక తను ఆల్రెడీ కమిట్ అయినట్టుగా త్రివిక్రమ్ సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఇది ఇప్పటి వరకూ త్రివిక్రమ్ టచ్ చేయని జాన్రా. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ కూడా అలాంటి మూవీ చేయలేదు. కొన్నాళ్ల క్రితం ఇది మైథలాజికల్ మూవీ అనే విషయం చెప్పాడు నిర్మాత నాగవంశీ. ఆ మైథాలజీకి త్రివిక్రమ్ తనదైన శైలిలో ఫాంటసీని కూడా యాడ్ చేసి రూపొందించబోతున్నాడట. ఆ క్రమంలో అల్లు అర్జున్ శివపుత్రుడుగా నటించబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తోంది.

శివ పుత్రుడు అంటే తమిళ్ హీరో విక్రమ్ గుర్తొస్తాడు. కానీ ఇది అలాంటి మూవీ కాదు. నిజంగానే శివుడి కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడు అల్లు అర్జున్ అని టాక్. మహా శివుడుకి జలంధరుడు, కార్తికేయుడు అని ఇద్దరు కొడుకులు ఉంటారు. వారిలో కార్తికేయుడుగా అల్లు అర్జున్ ను చూపించబోతున్నాడట త్రివిక్రమ్. అలాగే శివుడి పాత్ర కూడా ప్రాధాన్యతతో ఉంటుందట. ఇందులో కొంత ఫాంటసీని కూడా జోడింగి మైథలాజికల్ ఫాంటసీ మూవీగా రూపొందించబోతున్నాడట త్రివిక్రమ్. ఇప్పటికే ప్రధాన పాత్రల ఎంపిక పూర్తయిందంటున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ ఇప్పటి వరకూ చూడనంత క్లాసీగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట త్రివిక్రమ్. సో.. మరి ఈ శివ పుత్రుడు ఎలా ఉండబోతున్నాడు అనేది ఇప్పటికైతే ఎవరి ఊహలకు అందేలా లేదు అని చెప్పొచ్చు.

Tags:    

Similar News