Allu Arjun : తమిళ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ ఫిక్స్

Update: 2025-02-10 06:30 GMT

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు. ఈ మూవీతో ఎన్నో రికార్డులు బద్ధలైపోయాయి. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ సైతం అప్లాజ్ అందుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ మూవీకి ఓటిటిలోనూ అద్భుతమైన ఆదరణ వస్తోంది. తాజాగా కాస్త ఆలస్యం అయినా సక్సెస్ మీట్ పెట్టుకుని సినిమా గురించి మాట్లాడుకున్నారు మేకర్స్ అండ్ యాక్టర్స్. పుష్ప 2 టైమ్ లో జరిగిన అనేక సంఘటనలు వీరిని ఆ మూవీ విజయాన్ని ఆనందించకుండా చేశాయనే చెప్పాలి. అందుకే ఇంత ఆలస్యంగా సక్సెస్ మీట్ జరిగిందన్నమాట.

పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. మైథలాజికల్ ఫాంటసీ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందబోతోందని ఇప్పటికే కన్ఫార్మ్ చేశారు. హారిక హాసినితో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ కూడా నిర్మాణంలో భాగం అవుతోంది. అయితే అల్లు అర్జున్ .. తమిళ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం అట్లీ వచ్చి ఐకన్ స్టార్ ను కలిశాడు. కానీ కథ ఫైనల్ కాక ప్రాజెక్ట్ ఆగిపోయిందన్నారు. బట్ అట్లీ పట్టు వదల్లేదు. మరోసారి అతనికి ఓ కథ చెప్పాడు.ఇది నచ్చింది. వెంటనే ప్రాజెక్ట్ ఓకే అయింది. ప్యాన్ ఇండియా సినిమాగానే రాబోతోన్న ఈ చిత్రాన్ని తమిళ్ బ్యానర్ సన్ పిక్చర్స్ నిర్మించబోతోంది. ఈ నెలలోనే అట్లీ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చేయించుకున్నాడట. ఈ ప్రాజెక్ట్ గురించిన అఫీషియల్ డీటెయిల్స్ త్వరలోనే తెలియజేస్తారుట. అయతే త్రివిక్రమ్ తర్వాత స్టార్ట్ అవుతుందా లేక రెండూ ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటాయా అనే క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News