Amala Paul : అమలా పాల్ రెండవ వివాహం చేసుకుందా..?

Amala Paul : అమలా పాల్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు;

Update: 2022-09-09 10:30 GMT

Amala Paul : అమలా పాల్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవళ పంజాబీ సింగర్ భవ్‌నిందర్‌సింగ్‌పై ఆమె తమిళనాడు పోలీసులకు ఫిర్యదు చేసింది. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే భవ్‌నిందర్‌సింగ్ అమలాపాల్ ఇద్దరూ కొంత కాలం డేటింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అమలా పాల్ ఫిర్యాదుతో పోలీసులు భవ్‌నిందర్‌సింగ్‌ను అరెస్టు చేశారు. అమలాపాల్‌తో తనకు ఎప్పుడో వివాహం జరిగిందని.. దానికి సంబంధించిన ఫోటోలను పోలీసులకు చూపించడంతో భవ్‌నిందర్‌కు బెయిల్‌పై విడుదలయ్యాడు.

2014లో కోలీవుడ్ దర్శకుడు విజయ్‌తో అమలా పాల్‌కు మొదటి వివాహం అయింది. కొన్ని కారణాల వల్ల వీరు మూడేళ్లకే విడిపోయారు. తరువాత సింగర్ భవనిందర్‌తో ప్రేమలో పడింది అమలాపాల్.. ఇద్దరూ కలిసి 2017లో పంజాబీ సంప్రదాయంలో వివాహం చేసుకున్నట్లు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇదంతా కేవలం ఫోటో షూట్ అని అమలాపాల్ తరువాత మీడియాకు చెప్పారు. 2018లో భవ్‌నిందర్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశామని.. ఆ సమయంలో తన ఆస్తులను, డబ్బును కాజేశాడని అమలా పాల్ చెప్పుకొచ్చింది. డబ్బులు తిరిగి అడిగితే సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలు బయటపెడతానంటున్నాడని అమలా పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Tags:    

Similar News