విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'లైగర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. అనన్య పాండే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా.. అంతగా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో మరో అవకాశం రాలేదు. ఇక బాలీవుడ్లో తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. లైగర్ ఫ్లాప్ తో సౌత్ ఆఫర్లను పక్కన పెట్టి బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టింది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య మంచి సత్సంబంధాలే ఉంటాయని.. బయటివారికి ఇదంతా ఏమి కనిపించదని చెప్పుకొచ్చింది.హీరోయిన్స్ అంతా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటారని వ్యాఖ్యానించింది. దానికి తానే ప్రత్యక్ష సాక్షినని పేర్కొంది.
అందుకే తనకు దీపిక పదుకొనె, భూమి పడ్నేకర్ లాంటి వారితో నటించే అవకాశం దక్కిందని వెల్లడించింది. అయితే ఇవేవి తెలియని వారు ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేస్తుంటారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తోంది అనన్య.