Anasuya Bharadwaj: త్వరలోనే బాలీవుడ్‌లో అనసూయ అడుగు..
Anasuya Bharadwaj: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌నే మలుపు తిప్పింది.;
Anasuya Bharadwaj (tv5news.in)
Anasuya Bharadwaj: ఒక కామెడీ షో అనేది ఎంతోమంది కమెడియన్స్‌కు, యాంకర్‌కు క్రేజ్ తెచ్చిపెట్టగలదని జబర్దస్త్ ప్రూవ్ చేసింది. దీంతోనే అనసూయ భరద్వాజ్ కూడా స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. తననూ విమర్శించే వారితో పాటు ఇష్టపడే వారు కూడా ఎక్కువే. ఓ వైపు యాంకర్‌గా రాణిస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిగా దూసుకుపోతోంది. ఒక త్వరలోనే నార్త్‌లో కూడా అనసూయ అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది.
అనసూయ భరద్వాజ్.. ముందుగా అడవి శేష్ హీరోగా వచ్చిన 'క్షణం' అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే హిట్‌తో పాటు మంచి నటి అన్న పేరును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తన కెరీర్‌నే మలుపు తిప్పింది. తాజాగా పుష్పలో కూడా లుక్స్ పరంగా డిఫరెంట్‌గా ట్రై చేసింది అనసూయ.
ప్రస్తుతం అనసూయ.. తన మలయాళం డెబ్యూకు సిద్ధమయ్యింది. స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న 'భీష్మ పర్వం'లో అనసూయ.. ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక తమిళంలో కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల అనసూయ కాస్త సన్నబడినట్టుగా అనిపిస్తోంది. అయితే ఇదంతా తన బాలీవుడ్ ఎంట్రీ కోసమే అని టాక్ వినిపిస్తోంది.
పుష్ప సినిమా హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో అనసూయ అంటే ఎవరో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యింది. అందుకే తనకు అక్కడ అవకాశాలు వస్తున్నాయంటూ టాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.