పెళ్లయ్యాక అమ్మనాన్నల విలువ తెలిసిందని నటి, యాంకర్ అనసూయ అన్నారు. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఫ్యామిలీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొందని చెప్పారు. సొంత ఫ్యామిలీయే మోసం చేయడంతో తన తండ్రి హైదరాబాద్ రేస్ క్లబ్‌లో ట్రైనర్‌గా పని చేశారని చెప్పారు. అప్పట్లో తమకు 12గుర్రాలు ఉండేవని.. అయితే జీవితంలో స్థిరత్వం ముఖ్యమని చెప్పారు. తన తండ్రి అది అర్ధం చేసుకోలేకపోయారని అన్నారు. తన తండ్రి ఎంతో హ్యాండ్సమ్ అని.. ఆయన అందమే తనకు వచ్చినట్లు అనసూయ చెప్పుకొచ్చింది.
తన జీవితంలో పెళ్లి పెద్ద టర్నింగ్ పాయింట్ అని అనసూయ తెలిపింది. ‘‘సినిమాల్లో ఎక్కువగా బిహార్ వాళ్లు విలన్‌గా కనిపిస్తుంటారు..., నేను బీహార్ వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నా. ప్రతి విషయంలోనూ ఆయన నాకు సపోర్ట్‌గా ఉంటారు. ఎంబీఏ చదువుతున్నప్పుడు ఓ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా ఇంటర్న్‌షిష్ చేశా. అక్కడే దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, మెహర్ రమేశ్‌లాంటి వారు పరిచయమయ్యారు. ‘ఆర్య 2’లోని ఓ పాత్ర కోసం సుకుమార్ సంప్రదించారు. సినిమా రంగంపై అప్పుడున్న సందేహాలతో నటించేందుకు అంగీకరించలేదు’’ అని అనసూయ తెలిపింది.