Anasuya Bharadwaj : థాంక్ యూ బ్రదర్: అనసూయ షాకింగ్ రెమ్యునరేషన్..?
అనసూయ ప్రధాన పాత్రలో థాంక్ యూ బ్రదర్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అనసూయ గర్భిణీ పాత్రలో నటిస్తుంది.;
బుల్లితెర పైన హోస్ట్ గా అలరిస్తూనే మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు వెండితెర పైన మెరుస్తుంటుంది యాంకర్ అనసూయ. క్షణం, రంగస్థలం సినిమాలతో ఆకట్టుకున్న ఈ రంగమ్మత్త... ప్రస్తుతం అరడజన్ సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలావుండగా అనసూయ ప్రధాన పాత్రలో థాంక్ యూ బ్రదర్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అనసూయ గర్భిణీ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో మే 7 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది.
ఈ చిత్రాన్ని ఆహ.. రూ.1.8 కోట్లకే కొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి గాను అనసూయ రోజుకు రూ.1.5 లక్షలు తీసుకుందని తెలుస్తుంది. మొత్తం అనసూయ 17 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొందని సమాచారం.. అంటే మొత్తంగా ఈ సినిమాకి గాను అనసూయకి పాతిక లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి రమేశ్ రాపర్తి దర్శకత్వం వహించారు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు.