Rashmi Gautam : సుధీర్‌తో ఆన్‌స్క్రీన్ రొమాన్స్.. బిజినెస్ మ్యాన్‌తో మ్యారేజ్?
Rashmi Gautam : వీళ్ల పెయిర్ బుల్లి తెరకే హైలెట్.. ఇద్దరూ కలిసి ఏ స్కిట్ చేసినా వావ్ అనాల్సిందే ఆడియన్స్..;
Rashmi Gautam : జబర్ధస్త్ యాంకర్ రష్మీకి, సుడిగాలి సుధీర్‌కి మధ్య స్మాల్ స్క్రీన్ లవ్ ట్రాక్ ఎప్పుడూ హైలెట్టే. వీళ్ల పెయిర్ బుల్లి తెరను షేక్ చేస్తుంది.. ఇద్దరూ కలిసి ఏ స్కిట్ చేసినా వావ్ అనాల్సిందే ఆడియన్స్.. మరి సూపర్ జోడీగా కొనసాగుతున్న వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా అంటే.. అబ్బే అలాంటిదేం లేదు.. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతుంటారు..
ఇదిలా ఉంటే రష్మీ.. ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకుందని.. అతడితో కలిసి హైదరాబాద్‌లోనే కాపురం పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. తనకు పెళ్లైన విషయం బయటకు వస్తే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి, పెళ్లి మ్యాటర్‌ను దాచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనపై వస్తున్న వార్తలపై రష్మీ త్వరలోనే క్లారిటే ఇచ్చే అవకాశం ఉంది. కాగా, సుధీర్, రష్మీలకు స్కిట్‌లో భాగంగా బుల్లితెర ఎప్పుడో పెళ్లి చేసింది. అది చాలా హిట్ అయ్యింది కూడా.
వీళ్లిద్దరి పెళ్లి వ్యవహారం ఆడియన్స్‌కి ఓ పజిల్‌లా మిగిలిపోతుంది. వారి అద్భుతమైన కెమిస్ట్రీని ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడతారు. వీరి ప్రేమ వ్యవహారంపై ఊహాగానాలకు తెరపడినట్టవుతుంది. ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో రష్మీని.. సుడిగాలి సుధీర్‌తో ప్రేమ వ్యవహారం గురించి అడిగితే..
తాను, సుధీర్ ఇద్దరం నటులం. అంతవరకే తమ పెర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పింది. తాము ఒక స్క్రిప్ట్ ప్రకారం పని చేస్తామని, ప్రజలను ఎంటర్‌టైన్ చేయడానికి తమ బెస్ట్ ఇస్తామని తెలిపింది. తామిద్దరం మంచి స్నేహితులమని. సుధీర్‌తో తన సంబంధం ప్రొఫెషనల్ మాత్రమే అని ఆ ఇంటర్వ్యూలో రష్మీ చెప్పింది.
గుంటూరు టాకీస్‌తో నటిగా మారింది రష్మీ. అందులో ఆమె చేసిన పాత్ర చాలా బోల్డ్ క్యారెక్టర్.. తరువాత చాలా ఆఫర్లు వస్తాయనుకుంది కానీ అలాంటిదేమీ జరక్కపోవడంతో నిరాశ చెందింది. ఇంక ఆ టైప్ సినిమాలు చేయకూడదని కూడా నిర్ణయించుకుంది. యాంకర్‌గానే రాణిస్తూ తనని తాను నిరూపించుకుంటోంది.
గతంలో యాంకర్ రవి సైతం పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టాడు. ఆయనకు పెళ్లై ఓ పాప కూడా ఉందని తెలిసి నెటిజన్లు నోరెళ్లబెట్టారు. ఇప్పుడు రష్మీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుధీర్ పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.