Andrea Jeremiah : పెళ్లి చేసుకోకపోయినా హ్యాపీగానే ఉన్నా : ఆండ్రియా

Update: 2024-02-28 07:45 GMT

తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని హీరోయిన్ ఆండ్రియా జెరెమియా (Andrea Jeremiah) తెలిపింది. తనక 20-, 25 ఏళ్లప్పుడు పెళ్లి ఆలోచన వచ్చిందని కానీ ఎందుకో కుదర్లేదని తెలిపింది. ఇప్పుడు తన వయుసు 40 అని, దీంతో ఇక పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని చెప్పింది. పెళ్లి చేసుకోకపోయినా తాను హ్యాపీగానే ఉంటానని.. తాను ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయానని తెలిపింది.

తనకు ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, జీవితంలో ఆనందంగా గడపాలని తాను భావిస్తున్నట్లు చెప్పింది. ఈమె తెలుగులో సునీల్ నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన తడాఖ మూవీలో సునీల్ కి భార్య పాత్రలో నటించింది. మొన్నీమధ్య వెంకటేశ్ 'సైంధవ్'లో ఈ అమ్మడు నటించింది.

ఈమె నటించిన 'పిశాచి 2' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు టాక్.

Tags:    

Similar News