Bhootham Praytham : భూతం ప్రేతం టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్

Update: 2025-09-24 08:34 GMT

సృజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి. వెంకటేశ్వర రావు నిర్మించిన చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేష్ ధృవ దర్శకత్వంలో రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌లో యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్ బాస్ ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు నటించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.

‘భూతం ప్రేతం’ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘భూతం ప్రేతం’ ఫస్ట్ లుక్ లాంఛ్ చేశాను. యాదమ్మ రాజు, భాస్కర్, నా టీం కోసం నేను లాంఛ్ చేశాను. టైటిల్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

‘భూతం ప్రేతం’ అనే టైటిల్ చూస్తుంటే హారర్, కామెడీ అని అర్థం అవుతోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఓ ఐదుగురు కుర్రాళ్లు.. భూతానికి, ప్రేతానికి చిక్కినట్టుగానే కనిపిస్తోంది. ఆ భూతం నుంచి ఈ కుర్రాళ్లు ఎలా బయటపడ్డారు? అనే కథను నవ్విస్తూ, భయపెట్టేలా మలిచారని అర్థం అవుతోంది. ఈ ఏడాదిలోనే ‘భూతం ప్రేతం’ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News