యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో జీ5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్ పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.
విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో రూపొందుతోన్న ఈ సిరీస్లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మీడియాతో 'బహిష్కరణ' యూనిట్ ముచ్చటించింది. సమాజంలోని వాస్తవికతలను, పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సిరీస్ ఉంటుందని మేకర్స్ తెలిపారు.
సస్పెన్స్ థ్రిల్లర్ ను నేషనల్ వైడ్ గా ఆదరణ ఉంటుందని నమ్మకం వెలిబుచ్చారు మేకర్స్.