Ram Charan : రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం

Update: 2025-09-20 08:24 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత్లో మొదటి సారి జరగనున్న ఆర్చరీ ప్రీమియ ర్ లీగ్ కు ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ మేరకు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబరు 2 నుంచి 12 వరకు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ జరగనుం ది. ఇందులో భారత్ తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొననున్నారు. ఇందులో మొత్తం 6 జట్లు ఉంటాయి. వీటిలో 36 మంది అగ్ర శ్రేణి భారత ఆర్చర్లు, 12 మంది అంతర్జా తీయ ఆర్చర్లు ఉంటారు. వీరిలో కొంత మంది వరల్డ్ టాప్ 10లో ఉన్నవారు. దేశ ఒలింపిక్ కలను బలపరచడం, దేశంలో ఆర్చరీ క్రీడను మరింత పెంచి అం తర్జాతీయంగా ఖ్యాతి తేవడం ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం. ఈ లీగ్ యువ ఆర్చరీ క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు, ఆర్చరీ క్రీడ పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది. రామ్ చరణ్ వంటి ప్రముఖ వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం వల్ల ఈ లీగ్ మరింత గుర్తింపు పొందుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ లీగ్ యువతను క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు దోహదపడుతుంది. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. ఆర్చరీ అనే క్రీడ..క్రమశిక్షణ, ఫోకస్‌, స్థితిస్థాపకతను కలిగి ఉంటుందన్నారు. ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో కలిసి కొనసాగడం గర్వంగా ఉందని.. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు గ్లోబల్‌ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తుందన్నారు. భవిష్యత్‌ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని చరణ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News