Saanve Megghana : కోలీవుడ్ లో హిట్ కొట్టిన మరో తెలుగమ్మాయి

Update: 2025-01-24 11:30 GMT

తెలుగు వారికి తెలుగు వాళ్లు అవకాశాలు ఇవ్వరు అనేది ఎప్పటి నుంచో ఉన్న కంప్లైంట్. అందుకే మన అమ్మాయిలు ఇతర భాషల్లో హీరోయిన్లుగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి అంజలి, శ్రీ దివ్య, ఆనంది వరకూ అక్కడ జెండా ఎగరేశారు. వీళ్లంతా మీడియం రేంజ్ హీరోలతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ తో పాటు కాస్త రెస్పెక్టబుల్ హీరోయిన్ అనే ట్యాగ్ కూడా సంపాదించుకున్నారు. రీసెంట్ గా నిహారిక కొణిదల ట్రై చేసింది. కానీ తను నటించిన సినిమాకు ది బెస్ట్ అనే రివ్యూస్ అయితే రాలేదు. లేటెస్ట్ గా మరో తెలుగమ్మాయి కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే మంచి ఇంప్రెషన్ వేయడమే కాక హిట్ టాక్ కూడా తెచ్చుకుంది.

ఆ బ్యూటీ పేరు శాన్వీ మేఘన. తెలంగాణ అమ్మాయి. ఇంతకు ముందు ఇక్కడ పిట్టకథలు అనే ఆంథాలజీలో రాముల అనే ఎపిసోడ్ లో అదరగొట్టింది. తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఓ పాత్ర చేసింది. పుష్పక విమానంలో తనను చూసిన చాలామంది ఇంత హుషారుగా ఉంది.. ఖచ్చితంగా మంచి హీరోయిన్ అవుతుందనుకున్నారు. ఆ సినిమా పోయింది. తన ఆఫర్లూ పోయాయి. ఈ టైమ్ లో కోలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న మణికందన్ సరసన కుడుంబస్తాన్ అనే సినిమాలో ఆఫర్ అందుకుని నటించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ఫుల్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

కుడుంబస్తాన్ అంటే ఫ్యామిలీ మేన్ అని అర్థం. మిడిల్ క్లాస్ స్ట్రగుల్స్ ను ఎంటర్టైనింగ్ గా చెప్పిన ఈ కథలో శాన్వీ హీరోయిన్ గా నటించింది. నటనకు కాస్త స్కోప్ ఉన్న పాత్ర. ఆమె నటన కోలీవుడ్ కూ నచ్చింది. మంచి రివ్యూస్ పడుతున్నాయి. మరి ఈ మూవీతో శాన్వీ మరిన్ని కోలీవుడ్ ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News