Anu Immanuel: ఏంటా ప్రశ్నలు.. ఇంకేం లేవా: రిపోర్టర్‌పై అను ఫైర్
Anu Immanuel: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఊర్వశివో.. రాక్షసివో విడుదలకు సిద్ధంగా ఉంది. తండ్రి అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంపై శిరీష్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.;
Anu Immanuel: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఊర్వశివో.. రాక్షసివో విడుదలకు సిద్ధంగా ఉంది. తండ్రి అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంపై శిరీష్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు.
నాని నటించిన మజ్నూ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ మలయాళీ బ్యూటీకి ఆ చిత్రం మరికొన్ని ఆఫర్లను తెచ్చిపెట్టింది. ఒకటి రెండు విజయవంతమైనా చాలా సినిమాలు ప్లాపయ్యాయి. దాంతో అమ్మడికి అవకాశాలు సన్నగిల్లాయి అని అనుకుంటున్న తరుణంలో అల్లు శిరీష్‌తో నటించే అవకాశం వచ్చింది.
తెరపైనే కాదు తెర వెనుక కూడా వీరిద్దరూ రొమాన్స్ చేస్తున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. అదే ప్రశ్నను డైరెక్ట్‌గా అడకుండా ఓ రిపోర్టర్ అనుని ఇంటర్వ్యూ చేస్తూ.. అప్పుడు అల్లు అర్జున్ (నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా)తో, ఇప్పుడు అల్లు శిరీష్‌తో నటించారు కదా, ఎవరు క్యూటీ.. ఎవరు నాటీ అని అడిగారు. దాంతో ఆమె ఒకింత అసహనాన్ని ప్రదర్శిస్తూ.. ఇంకే ప్రశ్నలు లేవా అడగడానికి.. కాస్త మంచి ప్రశ్నలు వేయండి అని రిపోర్టర్‌ని సున్నితంగా మందలించింది.