Action King Arjun : మఫ్టీ పోలీస్ గా అర్జున్

Update: 2025-11-18 07:17 GMT

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ - ఐశ్వర్య రాజేష్ ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా "తీయవర్ కులై నడుంగ" తెలుగులో "మఫ్టీ పోలీస్"గా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని... తెలుగులో "మఫ్టీ పోలీస్" పేరుతో ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ... శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు.

ఒక రచయిత హత్య నేపద్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రంలో పర్సనల్ డ్రామాకు పెద్ద పీట వేయడం విశేషం. అలాగే ఇటీవలకాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చర్చించి ఉండడం గమనార్హం.

ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ. ఎన్. బాలాజీ మాట్లాడుతూ... "యాక్షన్ కింగ్ అర్జున్ - ఐశ్వర్య రాజేష్ అలియాస్ భాగ్యంలకు తెలుగునాట ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో "మఫ్టీ పోలీస్" చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో యాక్షన్ తోపాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అద్భుత అవకాశాన్ని నాకు అందించిన జి.అరుల్ కుమార్ గారికి, ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్ లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అన్నారు. 

Tags:    

Similar News