Ashika Ranganath : ఆషికా రంగనాథ్ సిస్టర్ కాదంట

Update: 2025-07-30 09:15 GMT

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ గేర్స్ మారుతున్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకుని ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం చూస్తోంది. అఫ్ కోర్స్ ఇంకా కొంత విఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి ఉందట. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. అయినా ఇబ్బందేం లేదు బెస్ట్ క్వాలిటీతోనే వస్తాం అని వేచి చూస్తోంది టీమ్. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఎప్పుడు వచ్చినా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడం ఖాయం అని చెబుతున్నారు.

విశ్వంభరలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. స్టాలిన్ తర్వాత చిరంజీవితో జోడీ కడుతోంది తను. ఇతర కీలక పాత్రల్లో అషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి వంటి బ్యూటీస్ నటిస్తున్నారు అని చెప్పారు. అయితే వీరంతా చిరంజీవికి చెల్లెళ్లుగా కనిపిస్తారు అనే ప్రచారంతో పాటు రకరకాల లోకాల్లోని దేవ కన్యలుగానూ కనిపిస్తారు అనే టాక్ వచ్చింది. ఆ టాక్ సంగతి ఎలా ఉన్నా.. వీరిలో అషికా రంగనాథ్ మాత్రం చెల్లెగానో, దేవ కన్యగానో నటించడం లేదు. తను కూడా మరో హీరోయిన్ గా చేస్తోందట. అంటే చిరంజీవికి ఇద్దరు హీరోయిన్లు అన్నమాట. ఈ మేరకు దర్శకుడు రీసెంట్ ఇంటర్వ్యూలో ఓ క్లారిటీ ఇచ్చాడు. మొత్తంగా అషికా రంగనాథ్ అప్పుడే చెల్లెలు అయిపోయిందా అని ఫీలయిన వాళ్లు హ్యాపీస్ అయిపోతున్నారు. ఏదేమైనా కొందరు బ్యూటీస్ ను అలాంటి పాత్రల్లో చూడలేరేమో కొందరు. 

Tags:    

Similar News