Ashwini Dutt : 'ప్రాజెక్ట్ కె' గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన అశ్వని దత్
Ashwini Dutt : వైజయంతీ మూవీ బ్యానర్స్‌పై విడుదలైన సీతారామం భారీ కలెక్షన్లతో మంచి రివ్యూలతో దూసుకెళుతోంది..;
Ashwini Dutt : వైజయంతీ మూవీ బ్యానర్స్‌పై విడుదలైన సీతారామం భారీ కలెక్షన్లతో మంచి రివ్యూలతో దూసుకెళుతోంది.. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్, వైజయంతి మూవీ బ్యానర్ అధిపతి అశ్వనీ దత్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తనయులు నిర్మించి జాతి రత్నాలు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు చూసి కడుపుబ్బానవ్వుకున్నామన్నారు. చీరంజీవితో చూడాలని వుంది తెలుగులో నిర్మించి భారీ సక్సస్ కొట్టినా హీందీలో రీమేక్ చేసి అల్లుఅరవింద్, తానూ కలిసి చెరో 6 కోట్లు నష్టపోయామన్నారు.
హీరోగా వైజంతీమూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న భారీ చిత్రం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'.. ఈ సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తయిందన్నారు. జగదేకవీరుడు అతిలోకసుంది పార్ట్ 2 తీసి సినీ కెరీర్ ఎండ్ చేద్దామనుకుంటున్నట్లు అశ్వినీదత్ చెప్పుకొచ్చారు.