Allari Naresh : నేను ఎవ్వరి కోసం మారను.. బచ్చల మల్లి టీజర్..

Update: 2024-11-28 11:45 GMT

అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. టీజర్ తో పాటు ఈ చిత్రాన్ని డిసెంబర్ ౨౦న విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. నాంది లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ అలాంటి హిట్ పడలేదు నరేష్ కి. మంచి కమ్ బ్యాక్ కోసం చూస్తోన్న అతనికి ఈ మూవీ హిట్ ఇస్తుందనుకుంటున్నారు. బట్ టీజర్ లో అంత స్టఫ్ అయితే కనిపించడం లేదు అనే చెప్పాలి. జస్ట్.. నరేష్ మేకోవర్ తో పాటు అతనో కొత్త పాత్ర ట్రై చేశాడు అనేది మాత్రమే తెలుస్తోంది. ఆ పాత్రలు, కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్ చూస్తుంటే ఇది 90స్ లేదా అంతకు ముందటి కథలా కనిపిస్తోంది. టీజర్ చూస్తే..

‘మల్లి అనే ఓ రౌడీలాంటి హీరో కథలా ఉంది. అతను కావేరీ అనే అమ్మాయిని ప్రేమించడం.. తను ఛీ కొట్టడం.. తండ్రి అంటే గౌరవం లేకపోవడం.. పోలీస్ లను సైతం ఎదురిస్తూ.. చిన్నప్పటి నుంచి నీ మూర్ఖత్వం వల్లే నీ జీవితం ఇలా అయిందన్న తల్లి డైలాగ్, నేను ఎవ్వరి కోసం మారను.. నాకు నచ్చినట్టు నేం బతుకుతా..’ఇదీ టీజర్ లో కనిపించిన కంటెంట్. మల్లి అనే వాడి క్యారెక్టరైజేషన్ ను చూపిస్తోంది తప్ప.. కథ, ఇందులోని ఎమోషన్, ఇంకేదైనా నావల్ పాయింట్ అంటూ కొత్తగా ఏం లేదు అనే చెప్పాలి.

కాకపోతే.. ఇది నిజంగానే జరిగిన కథ అనేది మేకర్స్ చెప్పిన మాట. 90ల్లో తుని ప్రాంతంలో ఓ వ్యక్తి కథనే దర్శకుడు సినిమాటిక్ గా మార్చి రూపొందిస్తున్నాడు అని టాక్. కొన్నిసార్లు ఇలాంటి కథలు బాగా కనెక్ట్ అవుతాయి. అదే జరిగితే బచ్చల మల్లి విజయం సాధిస్తుంది. పైగా ఇప్పటి వరకూ వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. ఏదేమైనా టీజర్ మాత్రం అప్ టూ ది మార్క్ లేదు అనే చెప్పాలి. 

Full View

Tags:    

Similar News