అల్లరి నరేష్ ఓ కొత్త పాత్ర ప్రయత్నించాడు అంటే ఖచ్చితంగా అది నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. కామెడీ హీరోగా పీక్స్ లో ఉన్న టైమ్ లో కూడా సీరియస్ లో రోల్స్ తో సూపర్బ్ అనిపించుకున్నాడు. కొన్నాళ్లుగా కామెడీ కంటే సీరియస్ రోల్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈ క్రమంలో కెరీర్ లో ఇప్పటి వరకూ కనిపించనంత ఊరమాస్ గా వస్తోన్న సినిమా ‘బచ్చలమల్లి’. హానుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈ నెల 20న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా బచ్చల బల్లి ట్రైలర్ ను నాని చేతుల మీదుగా విడుదల చేశారు.
మల్లి అనే ఓ మూర్ఖుడి కథ అని దర్శకుడు సుబ్బు మంగాదేవి ముందు నుంచీ చెబుతున్నాడు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉంటుందనుకున్నారు. బట్ ఈ ట్రైలర్ చూస్తే అద్భుతమైన ఎమోషన్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ పాత్ర తుని ప్రాంతంలో నిజంగా ఉన్నదే అని దర్శకుడు చెప్పాడు. అందువల్ల ఆ రా ఇంటెన్సిటీ పాత్రలో కనిపిస్తోంది. ఎప్పట్లానే నరేష్ తన పాత ఇమేజ్ ను ఎక్కడా కనిపించనివ్వలేదు. ఆ క్యారెక్టర్ ను ఓన్ చేసుకున్నట్టుగా కనిపించాడు.
ట్రైలర్ చూస్తే.. వర్షంలో రోడ్ పై అనాథలా పడి ఉన్న మల్లి గురించి పోలీస్ అయిన రావు రమేష్ ఒక లేడీని అడుగుతున్న సందర్భంలో ప్రారంభం అవుతుంది. ఏవవుతాడమ్మా నీకతను అంటే.. వరసకి చిన్నాన్న అవుతాడు అంటుందా లేడీ.. దీనికి ‘నేను మీ చిన్నాన్నను ఎక్కడ కలిసానో తెలుసా అమ్మా.. సత్యవరం జాతర్లో. ఆ రోజు ఎదటోన్ని కొట్టడంలో ఆయన చూపించిన శ్రద్ధ చాలా గొప్ప విషయం.. ఇంకోసారి మీ చిన్నాన్నగారిని ఎక్కడ కలిసానో చెప్పనా అమ్మా.. ఓ బ్రోతల్ కోసం మా పోలీసోన్ని కొడుతుంటే.. ఆణ్నాపడానికి మధ్యలోకెళితే నన్ను కూడా తోసేశాడు’.. అంటూ మల్లి పాత్రను పరిచయం చేస్తున్నట్టుగా ఆయా సన్నివేశాలతో సాగుతుంది ట్రైలర్. ‘పోలీస్ మాయ్యా దెబ్బలు పెద్దగా ఆనట్లేదు.. ఇంకొంచెం గట్టిగా ట్రై చెయ్’ అనడంలో ఆ పాత్రలో ఎంత మొండితనం ఉందో చెబుతుంది.
మనిషిలో బిపి, సుగరూ, కొలెస్ట్రాలూ కొలవడానికి మిషన్లొచ్చాయి.. మూర్ఖత్వాన్ని కొలవడానికి ఇంకా రాలేదు. ఒకవేళ ఉండుంటే.. నీ విషయంలో బోర్డర్ దాటేత్తాది మల్లి ఫ్రెండ్ చెప్పే డైలాగ్.. ఈ క్యారెక్టరైజేషన్ ను చెబుతాయి. అలాంటి మల్లి ఓ అమ్మాయి ప్రేమలో పడి.. తాగుడు, సిగరెట్లు మానేయడం.. తర్వాత అమ్మాయి తండ్రి ఎంట్రీ.. ఆపై మల్లి లోని మూర్ఖత్వం మళ్లీ స్టార్ట్ కావడం.. చివరికి ఈ మల్లి కథ ఏమైంది అనేది తెలియాలంటే డిసెంబర్ 20న సినిమా చూడాలి.
మొత్తంగా అల్లరి నరేష్ నుంచి మరో ఇంటెన్స్ స్టోరీ రాబోతోందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఆల్రెడీ వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ సైతం ఇంప్రెసివ్ గా ఉంది. ప్రామిసింగ్ అనిపిస్తోంది. మరి ఈ మల్లి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.