Veera Simha Reddy: అట్లుంటది అభిమానం అంటే.. 200 కార్లలో థియేటర్‌కు..
Veera Simha Reddy: తగ్గేదేలే.. బాలకృష్ణ సినిమా వస్తే ఎట్లుంటరేంది.. సీట్లో కూసోని ఒక్కడైనా సినిమా చూస్తడా.. గోల గోల చేయొద్దు..;
Veera Simha Reddy: తగ్గేదేలే.. బాలకృష్ణ సినిమా వస్తే ఎట్లుంటరేంది.. సీట్లో కూసోని ఒక్కడైనా సినిమా చూస్తడా.. గోల గోల చేయొద్దు.. ఈలలేయొద్దు హాలు దద్ధరిల్లేలా.. మరి మా బాలయ్య బాబు సినిమా అంటే మాకు సంక్రాంతి పండగే.. అంటున్నారు బాలకృష్ణ అభిమానులు.
ఈ రోజు విడుదలైన వీరసింహారెడ్డిని చూసేందుకు నిజామాబాద్ జిల్లా అభిమానులు మూకుమ్మడిగా మాట్లాడుకున్నారు.. సుమారు 200 కార్లు అరేంజ్ చేసుకుని అందరూ ఒక్కసారిగా తరలి వెళ్లి సినిమా చూడాలనుకున్నారు.. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టేసి కార్లెక్కాసారు అంతా.. జై బాలయ్య అంటూ అరుచుకుంటూ తమ అభిమానాన్ని ప్రకటించుకున్నారు.. వీరసింహారెడ్డి హిట్ టాక్ తెచ్చుకోవడంతో వారి ఆనందానికి అంతే లేకుండా పోయింది.
గోపీచంద్ మలినేని రచన మరియు దర్శకత్వం వహించిన వీరసింహా రెడ్డి మాస్-యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. బాలకృష్ణతో శృతిహాసన్ కలిసి నటించిన మొదటి చిత్రం కూడా ఇదే కావడం విశేషం.