Bheemla Nayak: భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేది అప్పుడే..
Bheemla Nayak: మలయాళంలో సినిమాలు స్లోగా ఉన్నా ఏదో మ్యాజిక్ చేస్తాయి.;
Bheemla Nayak (tv5news.in)
Bheemla Nayak: మలయాళంలో సినిమాలు స్లోగా ఉన్నా ఏదో మ్యాజిక్ చేస్తాయి. అందుకే సినిమా రీమేక్‌ల విషయాలనికొస్తే చాలావరకు సినీ పరిశ్రమలు మాలీవుడ్ వైపే చూస్తాయి. పవన్ కళ్యాణ్, రానా కూడా అదే చేశారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన యాక్షన్ 'అయ్యపనుమ్ కోషియుమ్' అనే చిత్రాన్ని తెలుగులో 'భీమ్లా నాయక్'గా తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర రూమర్ తెగ వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత 'వకీల్ సాబ్'తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. దాని తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి భీమ్లా నాయక్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ నెట్టింట్లో ఎక్కువగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్ గ్లింప్స్‌లు కూడా పవర్ ప్యాక్‌గా ఉన్నాయి. అందుకే భీమ్లా నాయక్ ట్రైలర్‌ను విడుదల చేసే పనిలో ఉందట మూవీ టీమ్.
తాజాగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలన్నీ గ్లింప్స్ తర్వాత ఏకంగా ట్రైలర్ దగ్గరికే వెళ్లిపోతున్నాయి. టీజర్‌తో కాకుండా ఏకంగా ట్రైలర్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తు్న్నాయి. భీమ్లా నాయక్ కూడా అదే తోవలో వెళ్లనుంది. డిసెంబర్ 14న ట్రైలర్ విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించిందట. ఇప్పటికే ఈ రూమర్‌పై పవన్, రానా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.