Peddi Movie Update : బిగ్ అప్డేట్ ..పెద్దిలో జిగేల్ రాణి స్టెప్పులు

Update: 2025-05-15 12:15 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామా జానర్ లో తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలకపాత్ర లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ లో రామ్ చరణ్ లుక్, విజువల్స్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాపై అంచనాలు భారీగా పెరగగా, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్ కు ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ ఈ సాంగ్ కోసం రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదట కాజల్ అగర్వాల్ ను అనుకున్నారనే టాక్ వచ్చింది. ఆ తర్వాత పుష్ప సినిమాల్లో కిసిక్స్ పాటతో అందరినీ అలరించిన ఎనర్జిటిక్ భామ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఆమె దాదాపుగా ఖాయ మైందనే వాదన కూడా బలంగా వినిపించిం ది. ఇప్పుడు తాజాగా బుట్టబొమ్మ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూజా హెగ్దేతో ఈ పాట చేయిద్దామనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. గతంలో జిగేల్ రాణి ఐటెం సాంగ్ లో కూడా పూజ హెగ్దే నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ సెంటిమెంట్ ను పెద్ద సినిమాలో.. వాడుకోవాలని చూస్తున్నారనే టాక్ వస్తోంది.

Tags:    

Similar News