Bigg Boss 5 Telugu: పింకీ నా కొడుకును పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోను: మానస్ తల్లి
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతీ సీజన్‌లో ప్రేక్షకులను అలరించడానికి ఒక ప్రేమజంట కచ్చితంగా ఉంటుంది.;
Bigg Boss 5 Telugu (tv5news.in)
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతీ సీజన్‌లో ప్రేక్షకులను అలరించడానికి ఒక ప్రేమజంట కచ్చితంగా ఉంటుంది. అయితే ఈసారి బిగ్ బాస్‌లో అలాంటి ప్రేమజంట ఎవరో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. ముందుగా సింగర్ శ్రీరామచంద్ర, హమీదా తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించినా.. కొన్నాళ్లకే హమీదా ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఈసారి బిగ్ బాస్ తెలుగులో ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ చాలా ఫేమస్ అవుతోంది. ఈ లవ్ స్టోరీపై అబ్బాయి తల్లి స్పందించారు కూడా.
ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ అంతకు ముందు కామెడీ షోలతో ప్రేక్షకులను అలరించినా కూడా బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత తన మంచితనంతో, క్యారెక్టర్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తను గెలిస్తే బాగుండు అని సపోర్ట్ చేస్తున్నవారు చాలామందే ఉన్నారు. తన మంచితనంతో అందరినీ ఇంప్రెస్ చేసిన ప్రియాంకకు కేవలం ఒకే విషయంలో నెగిటివిటీ ఎదురవుతోంది. దానికి కారణం మానస్.
పింకీ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి దాదాపు అందరు హౌస్‌మేట్స్‌ను అన్నయ్య అని పిలుస్తూ వారికి దగ్గరయిపోతుంది. కానీ మొదటి నుండి మానస్‌ను మాత్రమే అలా పిలవకలేకపోతుంది. స్టార్టింగ్ నుండి మానస్‌పై ఇష్టాన్ని పెంచుకున్న పింకీ మెల్లమెల్లగా తనకు చాలా దగ్గరయిపోయింది. ఇటీవల పింకీ 'దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్ని' అని మానస్‌తో అన్న మాటలు వైరల్ అయ్యాయి. దీనిపై మానస్ తల్లి స్పందించారు.
ప్రియాంక చాలా మంచి అమ్మాయి అని, తనంటే చాలా ఇష్టమని వ్యాఖ్యానించారు మానస్ తల్లి పద్మిని. బిగ్ బాస్ అనేది కేవలం ఆట అని, అలా హౌస్‌లో ఉన్నంత వరకు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండడం కామన్ అన్నారు. అంతే కాని బిగ్ బాస్‌లో ప్రేమల గురించి తనకు నమ్మకం లేదన్నారు. ఏదైనా షో వరకే అని తేల్చి చెప్పారు. మానస్ పెళ్లి గురించి కూడా మనసులో మాట బయటపెట్టారు పద్మిని.
హౌస్‌లో మానస్‌కు ఎవరూ సెట్ కారు అని స్టేట్‌మెంట్ ఇచ్చారు పద్మిని. తాను ఎవరిని వేలు పెట్టి చూపిస్తే మానస్ ఆమెనే పెళ్లి చేసుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంక సింగ్.. మానస్‌ను పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోనని క్లారిటీ ఇచ్చారు. పింకీకి తగిన అబ్బాయిని చూపించి పెళ్లి చేస్తానని, అలా ప్రియాంకకు సపోర్ట్ చేస్తానని అన్నారు పద్మిని. మానస్ ఫస్ట్ లవ్ ఫెయిల్ అయినప్పటి నుండి కెరీర్‌పైనే దృష్టిపెట్టి సొంతంగా ఎదిగాడని గుర్తుచేసుకున్నారు.