OTT Biggboss Telugu : ఓటీటీ 'బిగ్‌బాస్' ప్రోమో వచ్చేసింది..!
OTT Biggboss Telugu : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఓటీటీ ‘బిగ్‌బాస్’ ప్రోమో రానే వచ్చింది. ఇప్పటివరకు బుల్లితెర పై సందడి చేయనుంది.;
OTT Biggboss Telugu : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఓటీటీ 'బిగ్‌బాస్' ప్రోమో రానే వచ్చింది. ఇప్పటివరకు బుల్లితెర పై సందడి చేసిన ఈ షో.. ఇప్పుడు 24/7 వినోదం పంచేందుకు రెడీ అయింది. 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్' పేరుతో ప్రసారంకానున్న ఈ షోకి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో.. 'డిస్నీ+ హాట్‌స్టార్' ఓటీటీలో ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రోమోని కాస్త డిఫిరెంట్ గా ప్లాన్ చేశారు.
ఉరిశిక్ష ఖరారైన ఖైదీ తన చివరి కోరికగా బిగ్‌బాస్‌కి సంబంధించి ఒక్క ఎపిసోడ్‌ను చూడాలనుకుంటాడు. అయితే తన కోరిక మేరకు ఈ షోను ప్రసారం చేయగా అది ఎంతకీ పూర్తవదు. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ నాగర్జున చివర్లో షో ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశారు. ఈ ప్రోమోలో ఖైదీగా వెన్నెల కిశోర్, పోలీసు అధికారిగా మురళీశర్మ, లాయరుగా నాగార్జున కనిపించారు. ఇక ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్‌ల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.