Sankranthiki Vasthunam : యాక్చువల్లీ వెంకీ పాడింది కొంచెమే..

Update: 2024-12-30 11:45 GMT

స్టార్ హీరోలు అప్పుడప్పుడూ గొంతు వసరించుకుని అభిమానుల కోసమో, మ్యూజిక్ డైరెక్టర్స్ ఒత్తిడి వల్లో పాటలు కూడా పాడేస్తుంటారు. ఆ నలుగురు హీరోల్లో అప్పట్లో చిరంజీవి, మాస్టర్, మృగరాజు చిత్రాల్లో పాడాడు. నాగార్జున సీతారామరాజులో సిగరెట్ సాంగ్ పాడాడు. బాలయ్య మామా ఏక్ పెగ్ లా అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ చాలా సినిమాల్లో సింగేశాడు. ఎన్టీఆర్, రవితేజ లాంటి వాళ్లూ పాడారు. ఇక వెంకటేష్ గురు మూవీలో జింగిడి జింగిడి అనే పాటతో అదరగొట్టాడు. మళ్లీ ఇన్నాళ్లకు సంక్రాంతికి వస్తున్నాంలో పాడుతున్నాడు అనే ప్రోమో వచ్చినప్పుడే ఈ పాట కోసం చాలామంది ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చెప్పినట్టుగానే పాట వచ్చేసింది.

సంక్రాంతి సందర్భంగా ఊరంతా కలిసి సంబురాలు చేసుకునే వేళ వచ్చే పాటలా ఉంది. అందుకు తగ్గట్టుగానే కలర్ ఫుల్ యాంబియన్స్ ఉంటే అందుకు తగ్గట్టుగా జోష్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశాడు భీమ్స్ సిసిరోలియో. ‘గొబ్బియల్లో గొబ్బియల్లో పండగొచ్చే గొబ్బియల్లో.. ఎవ్రీ బడీ గొబ్బియల్లో సింగ్ దిస్ మెలోడీ గొబ్బియల్యో’ అనే ఫీమేల్ వర్షన్ తర్వాత.. ‘బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ అండ్ ఫైనల్లీ.. ఇట్సెన్ యాటిట్యూడ్ పొంగలూ.. ఇట్సే బ్లాక్ బస్టర్ పొంగలూ’ అంటూ వెంకటేష్ గొంతులో ఇంగ్లీష్ పదాలతో మిక్స్ అయిన పాట వినిపిస్తుంది.

అయితే వెంకీ పాడింది ఆ కొంచెమే ఇంక. అదే రెండు మూడు సార్లు రిపీటెడ్ గా ఉంది. అయినా పాటలో జోష్ ఉంది. ఎనర్జిటిక్ డ్యాన్సులున్నాయి. మీనాక్షి, ఐశ్వర్యలతో పాటు మాంచి డ్యూయొట్ లా కనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని వెంకీతో పాటు భీమ్స్ సిసిరోలియో, ‘మాయిపిలో’ రోహిణి సోరట్ కలిసి పాడారు.

Full View

Tags:    

Similar News