Bollywood Actor from Hyderabad : త్వరలోనే హైదరాబాద్ కు చెందిన బాలీవుడ్ యాక్టర్ పెళ్లి
మరికొద్ది రోజుల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్న బాలీవుడ్ నటులు;
నటులు తమన్నా భాటియా, విజయ్ వర్మ ప్రస్తుతం బి-టౌన్‌లో ఎక్కువగా మాట్లాడుకునే జంటలలో ఒకరు. నగరంలోని ఏదైనా విహారయాత్రలో లేదా ఏదైనా ఈవెంట్‌కు హాజరైనప్పుడు, వారి అద్భుతమైన కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతుండడం, ఆకర్షితులవుతుండడం, హైలెట్ గా నిలుస్తుండడం అందరికీ తెలిసిన విషయమే. వారి సిజ్లింగ్ రొమాన్స్ గురించి పలు నివేదికలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయినప్పటికీ వారు వారి వ్యక్తిగత జీవితంలో పలు వార్తలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. వారు తమ సంబంధాన్ని ధృవీకరించినప్పుడు కూడా అభిమానులు ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు, తమన్నా, విజయ్ త్వరలో తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. అవును, మీరు చదివింది నిజమే! ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవచ్చని తాజా గాసిప్ లు సూచిస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం, 30 ఏళ్లు పైబడిన తమన్నా భాటియా తల్లిదండ్రుల నుండి ఒత్తిడికి గురవుతుంది. తమన్నా తల్లిదండ్రులు ఆమెకు ఇప్పటికే పెళ్లి చేయాలని అనుకుంటున్నారని రిపోర్టులు సూచిస్తున్నాయి.
అయితే విజయ్‌తో వివాహానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాల్లో, పలు నేషనల్ మీడియాల్లో విస్తృతంగా వచ్చాయి. ఇద్దరూ త్వరలో దాని కోసం తేదీని నిర్ణయించవచ్చని ఇప్పుడు తాజాగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ పెళ్లి తేదీని నిర్ణయించడానికి విరామం ప్రకటించవచ్చని కూడా అంటున్నారు. అయితే, ఈ విషయంపై తమన్నా గానీ, విజయ్ గానీ, వారి ఇరువరి కుటుంబసభ్యులు, స్నేహితులు గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక తమన్నా విషయానికొస్తే.. ఆమె తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత స్థిరపడిన తారలలో ఒకరు. 2005లో ఆమె సినీ ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేయగా, హైదరాబాద్‌కు చెందిన విజయ్ 2012లో 'చిట్టగాంగ్'తో అరంగేట్రం చేశాడు.