ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా తీవ్రమైన ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం ఉదయం తన ఇంట్లో రివాల్వర్ మిస్‌ఫైర్ కావడంతో కాలుకు బుల్లెట్ గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు తగిన చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
1991లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్‌లతో కలిసి నటించిన ‘హమ్’ సినిమాతో పాపులారిటీని అందుకున్న గోవిందా, తెలుగులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రావణ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈ ఘటనపై గోవిందా స్పందిస్తూ, తన తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు అభిమానుల ప్రేమ వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే కూడా గోవిందాతో ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.