Bollywood Actor Mukul Dev : బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూత

Update: 2025-05-24 11:00 GMT

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ (54) కన్నుమూశా డు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిప డుతున్న ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీరియల్ నటుడిగా కెరీర్ను స్టార్ట్ చేసిన ముకుల్ పలు హిందీ సినిమా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'దస్తక్' తో సిల్వర్ స్క్రీన్కు పరిచయమైన ఆయన బాలీవుడ్లోనే కాకుండా తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ నటించాడు. రవితేజ హీరోగా నటించిన 'కృష్ణ'తో విలన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సినిమా తర్వాత కేడీ, అదుర్స్, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్, 'ఏక్ నిరంజన్' వంటి చిత్రాల్లో నటించారు. 2022లో విడుదలైన 'అంత్ ది ఎండ్' తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 'సింహాద్రి', 'సీతయ్య', 'అతడు' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్ .

Tags:    

Similar News