బాలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్ జానీ లివర్ తెలుగు వారన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన హిందీ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన వారసురాలు జెమీ లివర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంలో ఆమె నటించారు. తండ్రిని అనుకరించడంలో జెమీ దిట్ట. తనకు ఈ మూవీ ఆఫర్ హీరో నరేశ్ వల్లే వచ్చిందని జెమీ చెప్పుకొచ్చారు.
‘‘జీవితంలో ఒక్క తెలుగు సినిమా అయినా చేయాలన్నది నా కల. ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక కామెడీ సినిమా. నాకు కామెడీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అది నాకు చాలా నేచురల్‌గా వస్తుంది. అందరికంటే ముందుగా నరేశ్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే నన్ను గుర్తించి ఈ సినిమాలో క్యాస్ట్ చేశారు. టాలీవుడ్‌లో నాకు మొదటి సినిమానే అయినా ఇదే నాకు ఇల్లు అనిపిస్తోంది. నన్ను గైడ్ చేసి నడిపించిన అందరికీ థ్యాంక్స్’’ అంటూ ‘ఆ ఒక్కటి అడక్కు’ టీమ్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంది జేమీ లివర్.