Samyuktha Menon : సంయుక్తకు బంపర్ ఆఫర్

Update: 2024-10-09 11:30 GMT

మ‌ల‌యాళీ బ్యూటి సంయుక్త మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసింది. ఇప్పటివరకు హీరోయిన్‌గా అలరించిన ఈ బ్యూటీ మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టించ‌బోతుంది. న్యూ ఏజ్ యాక్ష‌న్ డ్రామా కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు యోగేష్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఇక ఈ వేడుకు ముఖ్య అతిథిగా వ‌చ్చిన రానా ద‌గ్గుబాటి క్లాప్ ఇవ్వగా నిర్మాతలు దిల్‌ రాజు, కోనా వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక సంయుక్త మీనన్ విషయానికి వస్తే ఇటీవలే విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం హీరో నిఖిల్‌తో స్వ‌యంభు అనే పాన్ ఇండియా సినిమా చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Tags:    

Similar News