Isha Talwar : ఆడిషన్ కు పిలిచి తన ఆత్మ గౌరవం దెబ్బ తీసింది : ఇషా తల్వార్
తెలుగులో 'గుండె జారి గల్లంతయ్యిందే', 'రాజా చెయ్యి వెస్తే ' వంటి చిత్రాల్లో నటించింది ఇషా తల్వార్ . ప్రస్తుతం ఈ భామను టాలీవుడ్లో ఆల్మోస్ట్ మరిచి పోయారు. తమిళం, హిందీ, పంజాబీ, మలయా ళంలోనూ ప్రయత్నాలు చేసినా ఆశించిన రేంజ్ కు చేరుకోలేకపోయింది. కొంత గ్యాప్ తర్వాత వెబ్ సిరీస్లు.. మీర్జాపూర్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, ఆర్టికల్ 15 చిత్రాల్లో అద్భుత నటనతో ఆకర్షించింది. ఇక ఈ ఏడాది అంతగా గుర్తించు కోలేని ఓ రెండు సినిమాల్లో నటించింది. తాజాగా ఈ భామ తనను తొలిసారి ఆడిషన్ చేసిన కాస్టింగ్ ఏజెంట్ షానూ శర్మపై ఊహించని ఆరోపణలు చేసింది. తనను ఆడిషన్ కు పిలిచిన షానూ.. బిజీ రెస్టారెంట్ లో ఒక ఏడుపు గొట్టు సీన్ లో నటించమని కోరడంతో నో చె ప్పిందట. అందరి ముందు ఆడిషన్ కు పిలిచి తన ఆత్మ గౌరవం దెబ్బ తీసిందని ఆరోపించింది. నిజానికి ఒక కాస్టింగ్ ఏజెంట్గా షానూ ప్రాక్టికల్గా ఆలోచించింది. చాలా మంది కాస్టింగ్ ఏజెంట్లు సింగిల్ గా రూమ్కి రమ్మని పిలుస్తున్న ఈ రోజుల్లో ఇషా తల్వార్కు చాలా మంది ముందు నటించే ఒక అద్భు తమైన అవకాశం వచ్చిందని, యుక్త వయసులో తన అపరిపక్వత గురించి మాట్లాడిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.