Bandla Ganesh : బండ్ల గణేశ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే ?

Update: 2024-05-03 07:59 GMT

నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్‌పై హీరా గ్రూప్ ఛైర్మన్ నౌహీరా షేక్ ఫిలింనగర్ పీఎస్‌లో కేసు పెట్టారు. నౌహిరా షేక్‌ ఫిలింనగర్‌లోని తన ఇంటిని గణేశ్‌కు నెలకు రూ.లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చారు. అయితే కొంతకాలంగా కిరాయి ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు ఫిబ్రవరి 15న తనను బెదిరించారని, గుండాలు, రాజకీయ నాయకుల సహాయంతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. తిరిగి తన మీదనే ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో డీజీపీకి ఫిర్యాదు చేశాుడ నౌహీరా షేక్. ఈ వ్యవహారం పై ఉన్నతాధికారుల ఆదేశంతో బండ్ల గణేష్ మీద ఐపిసి 341,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు.

Tags:    

Similar News