‘పుష్ప’ విలన్ ఫహాద్ ఫాజిల్‌పై ( Fahadh Faasil ) కేరళలో కేసు నమోదయింది. ఆయన నటిస్తూ నిర్మిస్తున్న ‘పెయిన్కిలీ’ సినిమా షూటింగ్‌ను ఎర్నాకులం ప్రభుత్వాస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చిత్రీకరించారు. అందులోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మానవ హక్కుల కమిషన్.. నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేసు నమోదు చేసింది.
ఫహాద్ ఫాజిల్ స్వతహాగా మలయాళ నటుడు. నిర్మాతగానూ పలు సినిమాలు తీసి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే విడుదలైన 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మలయాళంలో నిర్మాతగా ఫహాద్ పలు సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పింకేలీ సినిమా షూటింగ్‌ను ఓ ప్రభుత్వాసుపత్రిలోని ఎమర్జన్సీ వార్డులో చేశారు. గురువారం రాత్రంతా ఎమర్జన్సీ వార్డులో షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారు.