OTT: అమెజాన్ ప్రైమ్ లో 'చక్రవ్యూహం'

Update: 2023-07-06 09:45 GMT

ఇండియన్ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'చక్రవ్యూహం' సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.  అజయ్ పోలీస్ ఆఫీసర్ గా రూపొందిన ఈసినిమా  కుటుంబ సమేతంగా చూడదగ్గది. 1 గంట 47 నిముషాల నిడివితో ప్రతీ క్షణం ఉత్కంఠబరితమైన కథా, కథనంతో థియేటర్ లో విజయవంతంగా ప్రదర్శించబడింది.  విడుదలైన అన్ని సెంటర్లలో ప్రేక్షకుల చేత పాజిటివ్ పేరు తెచ్చుకుంది.  'చక్రవ్యూహం : ది ట్రాప్' మూవీలో వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి నటించారు. ప్రముఖ నటి జ్ఞానేశ్వరి కండ్రేగుల ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. చెట్కూరి మధుసూదన్ రచన దర్శకత్వంలో మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని శ్రీమతి సావిత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 

జూన్ 2న థియేటర్లో విడుదలైన చక్రవ్యూహం..  ఘనవిజయం సాధించింది. ఒళ్ళు గగుర్పొడిచే సస్పెన్స్ సన్నివేశాలతో థియేటర్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ఈ చిత్రం జూలై 5 నుంచి ఇండియా బెస్ట్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో దిగ్విజయంగా స్ట్రీమింగ్ అవుతోంది.   



 


Tags:    

Similar News