Priest Rangarajan: 'అఖండ' సినిమాపై బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు కామెంట్..

Priest Rangarajan: ధర్మానికి ఎంత నష్టం కలుగుతుందో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించారు.

Update: 2021-12-16 12:15 GMT

Priest Rangarajan: బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. అఖండ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. విడుదలైన అన్ని చోట్లా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తెలుగు సినిమాకు మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది అఖండ చిత్రం అని సినిమా వర్గాలు విశ్లేషించాయి.

బాలయ్య తన నట విశ్వరూపాన్ని మరోసారి తెరపై చూపించారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అఖండ చిత్రంపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు గారు వ్యాఖ్యానించారు. ఓ సినిమాపై మాట్లాడడం ఆయనకు ఇదే మొదటిసారి.

పోయిన వారమే ఈ సినిమా చూశాను. అప్పుడే చెప్పాలనుకున్నా.. కొన్ని కారణాలవల్ల చెప్పలేకపోయాను. ధర్మానికి ఎంత నష్టం కలుగుతుందో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించారు. ధర్మాన్ని రక్షించడం కోసం అందరం కలిపి పోరాడాలి. అహింసా ప్రథమో ధర్మ: అనేది ఎలా దుర్వినియోగమవుతుందో ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు.

ధర్మాన్ని రక్షించడం కోసం ఏమైనా చేయవచ్చు అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఇంతమంది ఈ సినిమా చూస్తున్నారంటే కారణం.. వారిలో ఆవేశం ఉంది.. ఆక్రోశం ఉంది. కానీ ఏమీ చేయలేకపోతున్నామనే బాధ కూడా ఉంది.

రామరాజ్య స్థాపన జరగాలని అందరూ కోరుకుంటున్నారు.. అందుకోసమే ఈ సినిమాను అందరూ ఆదించారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం ఉండాలని ఆయన అభిలషించారు. 

Tags:    

Similar News