Colour Photo Suhas : అప్పుడు 3 గంటలు అలానే ఏడ్చా : సుహాస్

Colour Photo Suhas : సినీ స్ట్రగుల్స్ గురించి సుహాస్ తన మధురానుభూతులను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.;

Update: 2022-08-03 06:25 GMT

Colour Photo Suhas : కలర్ ఫోటో సినిమాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సినీఇండస్ట్రీలో ఇప్పుడు సందీప్‌రాజ్, సుహాస్ తెలియని వారెవరూ ఉండరు. కలర్ ఫోటోకి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా యాక్టర్ సుహాస్ తన సినీకష్టాల గురించి ఓ ప్రముఖ ఇంటర్యూలో పంచుకున్నారు. "2016లో అప్పటికీ సినిమా అవకాశాలు నాకు సినిమా అవకాశాలు ఏవీ లేవు. కేవలం కొన్ని షార్ట్‌ఫిలిమ్స్ మాత్రమే చేసి ఉన్నా. నా దగ్గర అప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. డబ్బు చాలా అవసరం ఏర్పడింది. మా అన్నయ్య ఫ్రెండ్ ఒకాయన దగ్గరికి వెళ్తే.. అతను నాకు రూ.500 నోటు ఇచ్చి.. ఉంచరా అని వెళ్లిపోయాడు. ఆ నోటును పట్టుకొని.. దాన్నే చూస్తూ మూడు గంటలు ఏడ్చాను" అని ఇంటర్వ్యూలో తన మధుర ఘ్ణాపకాలను పంచుకున్నారు యాక్టర్ సుహాస్.

షార్ట్ ఫిలిమ్స్‌తో కొంత పాపులర్ అయి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు కలర్ ఫోటో హీరో. తన మొదటి సినిమాకే భారీ సక్సస్ రావడంతో అవకాశాలు ఒకదాని వెంట ఒకటి వచ్చిపడ్డాయి. రీసెంట్‌గా ఫ్యామిలీ మ్యాన్ అనే థ్రిల్లర్ మూవీలో కూడా సుహాస్ థ్రిల్లర్ రోల్ ప్లే చేశారు. ప్రస్తతుం 5 సినిమాలకు సైన్ చేసి బిజీగా ఉన్నారు. 

Tags:    

Similar News