విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘కింగ్ డమ్’. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. ఈ బ్యానర్ లో మోస్ట్ ప్రిస్టీజియస్ మూవీగా ఈ చిత్రాన్ని చెబుతున్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్ తో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సినిమాను మే 30న విడుదల చేయబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను అనౌన్స్ చేశారు.
ఈ నెల 30న కింగ్ డమ్ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఓ రైల్వే స్టేషన్ లో హీరోయిన్ తో పాటు కూర్చుని ఉన్నాడు విజయ్ దేవరకొండ. ముందు రైలు వెళ్లిపోతోంది. వీళ్లు ఓ బెంచ్ పై కూర్చుకున్నారు. మరి ఈ పాటకు సందర్భం ఏంటో కానీ.. రెగ్యులర్ డ్యూయొట్ కాకపోవచ్చు అనిపించేలా ఉంది. ఇక విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈచిత్రంపై అతనూ భారీ ఆశలు పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా సాలిడ్ కమ్ బ్యాక్ కోసం చూస్తున్నాడు విజయ్. ఆ కమ్ బ్యాక్ ఈ కింగ్ డమ్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని చెప్పాడు నిర్మాత నాగవంశీ.