Pushpa Movie: 'పుష్ప' కోసం క్రికెటర్స్ పెయిడ్ ప్రమోషన్స్? దీని వెనుక ఓ మాస్టర్ ప్లాన్..!
Pushpa Movie: ముందుగా డేవిడ్ వార్నర్.. పుష్ప సినిమాలోని పాటను ఎడిట్ చేసి ఈ చిత్రానికి తన ప్రమోషన్స్‌ను ప్రారంభించాడు.;
Pushpa Movie: 'పుష్ప' సినిమా గురించి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదలవ్వగానే నెగిటివ్ టాక్‌తో మొదలయిన పుష్ప కలెక్షన్స్ మెల్లగా వరల్డ్ వైడ్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇతర భాషలోని నటీనటులు మాత్రమే కాదు.. క్రికెటర్స్ కూడా పుష్ప సినిమా మీద ప్రత్యేకంగా ఫోకస్ వచ్చేలా చేశారు. అయితే దీని వెనుక ఓ కారణం ఉందని ఫిల్మ్ సర్కి్ల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఏ దేశ క్రికెట్ ఆటగాడిని చూసినా పుష్ప సినిమాలోని పాటనో, లేదా సీన్‌నో, లేదా అల్లు అర్జున్ మ్యానరిజంనో ఇమిటేట్ చేస్తూ కనిపిస్తున్నారు. పుష్పలో అల్లు అర్జున్ చెప్పే 'తగ్గేదే లే' డైలాగ్ అయితే క్రికెట్ వరల్డ్‌లో మారుమోగిపోతోంది. మరి క్రికెటర్స్ అందరికీ పుష్పపై ఎందుకింత క్రేజ్ అనేదానికి ఎన్నో రూమర్స్ వినిపిస్తు్న్నాయి.
ముందుగా డేవిడ్ వార్నర్.. ఎప్పటిలాగానే పుష్ప సినిమాలోని పాటను ఫేస్ యాప్‌తో ఎడిట్ చేసి ఈ చిత్రానికి తన ప్రమోషన్స్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత పలువురు క్రికెటర్లు రీల్స్ చేస్తూ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశారు. అయితే ఈ క్రికెటర్లంతా పుష్ప చిత్రం థియేటర్లలో ఉన్నప్పుడుకంటే ఓటీటీలో విడుదలయిన తర్వాతే ఎక్కువగా దీనిపై వీడియోలు చేయడం మొదలుపెట్టారు.
థియేటర్లలో విడుదలయిన నెల రోజుల తర్వాత పుష్ప అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవ్వడం మొదలయ్యింది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్రారంభమయిన తర్వాత క్రికెటర్స్ అందరూ దీనిపై మరింత ఫోకస్ పెట్టారు. అయితే ఇవన్నీ వారు కావాలని చేసినవి కావని, ప్రైమ్ ప్లాన్ చేసిన పెయిడ్ ప్రమోషన్స్‌లో ఇదంతా భాగమని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ క్రికెటర్స్‌తో ప్రమోషన్స్ చేయించడానికి కూడా ప్రైమ్ చాలానే ఖర్చు చేసినట్టు సమాచారం.