Marco series : హీరో లేకుండానే సీక్వెల్ తీస్తారట

Update: 2025-07-01 11:30 GMT

కొన్ని సినిమాలు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటాయి. అలాగని అవి ప్యాన్ ఇండియా ఆడియన్స ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి కాదు. కంటెంట్ ను బట్టి, రివ్యూస్ ఆధారంగా ఇతర భాషల్లోకి తర్వాత డబ్ అవుతుంటాయి. అలాంటి సినిమా మార్కో. మళయాలంలో రూపొందిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ 20న విడుదలై అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అంతే కాదు.. ఇండియాలోనే ఇప్పటి వరకూ ఇంతటి వయొలెంట్ మూవీ రాలేదు అనే గుర్తింపు అదనంగా తెచ్చుకుంది. తెలుగులోనూ విడుదలై డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. అయితే మార్కో లోని మితి మీరిన హింసపై విమర్శలు కూడా చాలానే వచ్చాయి. అయినా ఆ వర్గం ప్రేక్షకులను మెప్పించింది. దీంతో రెండో భాగం కూడా రూపొందించాలనుకున్నారు.

కొన్ని రోజుల క్రితం మార్కో కు సీక్వెల్ అనౌన్స్ చేసినంత పనిచేశారు. బట్ తర్వాత ఆ ప్రాజెక్ట్ పై వచ్చిన విమర్శల కారణంగా హీరో ఉన్ని ముకుందన్ సీక్వెల్ చేయను అని ప్రకటించాడు. ఈ చిత్రానికి రెండో భాగం ఉండదు అని కూడా చెప్పాడు. అయితే సినిమా రైట్స్ మొత్తం క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వద్ద ఉన్నాయట. అందుకే వాళ్లు సీక్వెల్ చేస్తున్నాం అని ప్రకటించారు. కాకపోతే ఈ సారి హీరోగా ఉన్నిముకుందన్ ను తీసుకోవడం లేదు. ఓ బాలీవుడ్ హీరో రెండో భాగంలో నటిస్తాడు అని ప్రకటించారు. ఉన్ని ముకుందన్ చేయను అన్నంత మాత్రాన ప్రాజెక్ట్ ఆపేయాలా.. అతన్నే తప్పించి వేరే హీరోతో చేస్తున్నాం అని చెప్పారు. మరి ఈ సారి ఇంకెంత వయొలెన్స్ ఉంటుందో కానీ.. మళ్లీ ఫస్ట్ పార్ట్ ను డైరెక్ట్ చేసిన హనీఫ్ అదేనీయే ఈ రెండో భాగాన్ని రూపొందిస్తాడు అంటున్నారు. సో.. క్రేజీ ప్రాజెక్ట్ సీక్వెల్ ను ఫస్ట్ హీరో లేకుండానే చేస్తారన్నమాట.

Tags:    

Similar News