Dacoit Teaser : ఇంట్రెస్టింగ్ గా డెకాయిట్ టీజర్

Update: 2025-12-18 06:46 GMT

అడివి శేష్ హీరోగా నటించిన మూవీ డెకాయిట్. ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. టీజర్ ను చాలా ఇంట్రెస్టింగ్ కట్ చేసింది మూవీ టీమ్. టైటిల్ కు తగ్గట్టుగానే అతనో దొంగగా నటించాడు అనిపించేలా ఉంది టీజర్. పాత్రలన్నీ కూడా హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. అడివి శేష్ క్యారెక్టరైజేషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనిపించేలా ఉంది. మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ ను కూడా హైలెట్ అయ్యేలా చేశాడు. తనతో పాటు ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునిల్, అతల్ కులకర్ణి కూడా కీలకంగా కనిపించబోతున్నారు.

కన్నెపెట్టరో కన్నుకొట్టరా అనే హలో బ్రదర్ మూవీలోని పాటతో టీజర్ కనిపిస్తోంది. పాటతో పాటు విజువల్స్ అన్నీ హైలెట్ అయ్యేలా ఉంది. మృణాల్ ఠాకూర్ హడావిడీగా కార్ నడిపిస్తూ కనిపిస్తోంది. అంతకు ముందే అతను ముద్దు పెట్టనా అంటూ అడివి శేష్ అని అడిగడం..దానికి సీరియస్ గా కార్ నడిపించడం.. ఆపై ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ లతో పాటు మిగతా ఆర్టిస్టులు కనిపించడం.. ఫైనల్ గా శేష్ తనో దొంగగా ఓ చిన్న అమ్మాయికి చెప్పడం ఇవన్నీ టీజర్ మొత్తంగా ఇంట్రెస్టింగ్ కట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇలాంటి మూవీస్ లో తను స్పెషల్ గా కనిపిస్తాడు శేష్.

షనీల్ డియో డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. కథ, స్క్రీన్ ప్లే అందించడంలో శేష్ హ్యాండ్ కూడా ఉంది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది మూవీని. మొత్తంగా మార్చి 19నే సినిమా విడుదల కాబోతోంది అని అనౌన్స్ చేశారు. 

Full View

Tags:    

Similar News