Deepthi sunaina: దీప్తిని మర్చిపోలేని షణ్నూ.. బర్త్‌డేకు స్పెషల్ పోస్ట్..
Deepthi sunaina: నేడు దీప్తి సునయన బర్త్‌డే కావడంతో షణ్నూ ఎప్పటిలాగానే తనను సోషల్ మీడియాలో స్పెషల్‌గా విష్ చేశాడు.;
Deepthi sunaina: షణ్నూ, దీప్తి బ్రేకప్ వారి అభిమానులను హర్ట్ చేసింది. ఈ ఇద్దరు గత అయిదు సంవత్సరాలుగా పలు షార్ట్ ఫిల్మ్స్‌తో, కవర్ సాంగ్స్‌తో, టిక్‌టాక్ వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. అందుకే వీరికి చాలామంది ఫ్యాన్స్ కూడా అయ్యారు. సోషల్ మీడియాలో వీరి ఫాలోయింగ్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే వచ్చింది. తాజాగా వీరి బ్రేకప్ సోషల్ మీడియాలో ఓ చిన్న సైజ్ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది.
తనది, షణ్నూది దారులు వేరని, ఇప్పటికైనా తన కెరీర్ మీద దృష్టిపెట్టాలనుకుంటున్న లాంటి కారణాలు చెప్తూ.. దీప్తి బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చేసింది. దాని తర్వాత షణ్నూ కూడా ఇది తన ఇష్టమంటూ దీప్తికే ఛాయిస్‌ను వదిలేశాడు. ఆ తర్వాత వీరిద్దరు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా.. వీరు పెట్టే పోస్టుల ద్వారా మాత్రం వీరు సంతోషంగా లేరని తెలుస్తోంది. నేడు దీప్తి సునయన బర్త్‌డే కావడంతో షణ్నూ ఎప్పటిలాగానే తనను సోషల్ మీడియాలో స్పెషల్‌గా విష్ చేశాడు.
షణ్నూ, దీప్తి సునయన కలిసి చేసిన చివరి పాట 'మలుపు'. ఈ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి తాను, దీప్తి కలిసి దిగిన పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు షణ్నూ. హ్యపీ బర్త్‌డే డీ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. మరి దీప్తి దీనికి రెస్పాండ్ అవుతుందా లేదా అని చాలామంది నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.